2. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఒ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? - అవినాశ్ చందర్
3. యుపిఎ ప్రభుత్వ హయాంలో అమలైన నిర్మల్ భారత్ అభియాన్ స్థానంలో ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం ఏ పేరుతో కొత్త పథకాన్ని రూపొందించింది? - స్వచ్ఛ భారత్ అభియాన్
4. ఇథనాల్‌తో నడిచే పర్యావరణహిత బస్సును కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరి ఎక్కడ ప్రారంభించారు? - నాగ్‌పూర్
5. ఇటీవల విశాఖలో 18 గంటల 18 నిమిషాల 18 సెకండ్లబాటు నిర్విరామంగా క్యారమ్స్ ఆడిన హైదరాబాద్ బాలిక ఎవరు? - షేక్ హుస్నా సమీర
6. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని 2014కిగాను అనంతపురానికి చెందిన అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఇచ్చారు. అయితే ఈ పురస్కారం ఏ విమర్శ సంకలనానికి లభించింది? - సీమ సాహితీస్వరం-శ్రీ సాధన పత్రిక
7. ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమితులైనది ఎవరు? - జస్టిస్ గోవిందరాజులు
8. ఇటీవల బ్రిటన్ ట్రెజరీ మంత్రిగా నియమితురాలైన భారత సంతతి మహిళ ఎవరు? - ప్రీతి పటేల్
9. అమెరికా నౌకాదళ ఫోర్స్టార్ అడ్మిరల్‌గా 2014 జూలైలో నియమితురాలైన తొలి మహిళ ఎవరు? - మిషెల్ హోవర్డ్
10. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో స్థానం సంపాదించిన తొలి ప్రదేశం ఏది? - మలేషియాలోని ప్రాచీన ప్యూ పిటీస్
11. బోర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? - మహరాష్ట్ర
12. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కొత్త హై కమిషనర్‌గా నవీ పిళ్ళై (దక్షిణాఫ్రికా)స్థానంలో నియమితులైన జోర్డాన్ యువరాజు ఎవరు? - జీద్ అల్ -హుస్సేన్
13. ఇటీవల జరిగిన భారత్ -బంగ్లా వన్డే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైనది ఎవరు? - భారత బౌలర్ స్టువర్ట్ బిన్నీ
14. ప్రపంచ ఫుట్‌బాల్ కప్‌ను అధికంగా అయిదుసార్లు గెలుచుకొన్న దేశం ఏది? - బ్రెజిల్
15. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర రావు(తెలంగాణ) ఏ రాషా్ట్రనికి గవర్నర్‌గా నియమితులయ్యారు? - మహరాష్ట్ర
16. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ ఏ రాషా్ట్రనికి నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు? - రాజస్థాన్
17. గుజరాత్ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన వాజూభాయ్ రూఢాభాయ్ వాలా, ఏ రాషా్ట్రనికి నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు? - కర్ణాటక
18. గోవా నూతన గవర్నర్‌గా నియమితులైనది ఎవరు? - మృదుల సిన్హా
19. ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై 2014-15కిగాను ఎంత శాతం వడ్డీ చెల్లించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ నిర్ణయించింది?- 8.75
20. ప్రస్తుత కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు? - నరేంద్ర సింగ్ తోమార్
21. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎవరు? - పి. మాణిక్యాల రావు
22. ప్రస్తుత పాకిస్థాన్ సైన్యాధిపతి ఎవరు? - జనరల్ రహీల్ షరీఫ్
23. తమిళనాడు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకుగాను ముఖ్యమంత్రి జయలలిత ఏ పథకాన్ని ప్రవేశ పెట్టారు? - అమ్మ బేబీకేర్ కిట్
24. పేద ప్రజలను బ్యాంకింగ్ సేవల రంగంతో అనుసంధానించడమే లక్ష్యంగా 2014 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన పథకం ఏది? - ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
25. తూర్పు ఆసియా విదేశాంగ మం త్రుల నాలుగో సదస్సు 2014 ఆగస్టు 10 న ఎక్కడ జరిగింది? - మయన్మార్ రాజధాని న్యేపిడా
26. ప్రపంచంలోని నిరుపేదల్లో మూడోవంతుమంది ఎక్కడ ఉన్నారని ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ది లక్ష్యాల తాజా నివేదిక వెల్లడించింది? - భారతదేశం
27. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలికి చైర్మన్‌గా నియమితులైనది ఎవరు? - టి. పాపిరెడ్డి
28. తెలంగాణ ప్రభుత్వ పాలన వ్యవహారాల నిబంధనల రూపకల్పనకుగాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌గా నియమితులైనది ఎవరు? - వి. నాగిరెడ్డి
29. శాసీ్త్రయ విధానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడమే లక్ష్యంగా విశాఖ జిల్లా చోడవరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించిన కార్యక్రమం ఏది? - పొలం పిలుస్తోంది
30. ఆంధ్రప్రదేశ్‌ను అయిదేళ్లలో కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది? - నీరు-చెట్టు
31. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? - 1955
32. విటి కల్చర్ అనేది వ్యవసాయానికి సంబంధించి దేనిని సూచిస్తుంది? - ద్రాక్షపండ్ల ఉత్పత్తి
33. భారతదేశంలో స్పేస్ సిటీగా ఏ నగరాన్ని పరిగణిస్తారు? - బెంగళూరు
34. ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజక వర్గంలో కనీసం ఒక గ్రామాన్ని 2016లోపు ఆదర్శంగా రూపొందించేందుకు కృషి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న పథకం ఏది? - సంసద్ ఆదర్శ గ్రామ యోజన
35. టర్కీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనది ఎవరు? - రిసెప్ తయ్యిప్ ఎర్దోగన్
36. టర్కీ రాజధాని ఏది? - అంకారా
37. కామిక్ పుస్తకాల్లో పుట్టి, ఆ తరవాత వెండితెరకు వచ్చిన బ్యాట్‌మెన్ పాత్ర ఇటీవల ఎన్నేళ్లు పూర్తి చేసుకొంది? - 75 ఏళ్లు
38. భారత్‌కు మూడేళ్ళుగా ఏ దేశం అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ 2014 ఆగస్టు 12న లోక్‌సభలో వెల్లడించారు? - అమెరికా
39. జార్ఖండ్‌లో రూ.22 వేల కోట్ల విలువైన ఇనుము, మాంగనీస్ ముడిఖనిజాన్ని అక్రమంగా తవ్వి పలు కంపెనీలు సొమ్ము చేసుకొన్నాయని ఇటీవల ఏ కమిషన్ తన నివేదికలో తెలిపింది? - జస్టిస్ ఎం.బి.షా
40. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకుగాను అవసరమైన వనరుల సమీకరణకు ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో రిసోర్స్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది? - రాజ్యసభ సభ్యుడు వై. సుజనా చౌదరి
41. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా అఫైర్స్ ఆఫ్ బిజినెస్ అవార్డు-2014 కార్యక్రమంలో ఇండియాస్ మోస్ట్ అడ్మైర్ కార్డియాలజిస్ట్ అవార్డుకు ఎంపికైనది ఎవరు? - కేర్ ఆసుపత్రుల చైర్మన్ డా. బి. సోమరాజు
42. ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాచా చౌదరి కార్టూన్ పాత్ర సృష్టి కర్త 2014 ఆగస్టు 5న హర్యానాలోని గుర్గావ్లో మరణించారు. అయితే ఆయన పేరు ఏమిటి? - ప్రాణ్‌కుమార్ శర్మ
43. అరవై ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వృద్దులకు ఆర్థిక భద్రత కల్పించేందుకుగాను పింఛన్‌తో కూడిన బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం పేరేమిటి? - విరిష్ఠ పింఛను బీమా యోజన
44. కోడెడ్ కాన్స్పిరసీ అనే నవలకు గాను అమెరికన్ లిటరరీ సొసైటీ పురస్కారానికి ఎంపికైనది ఎవరు? - నిఖిల్ చంద్వానీ
45. భారతదేశంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు చేసిన రాజకీయ పార్టీగా అగ్రస్థానంలో నిలిచినది ఏది? - శిరోమణి అకాలీదళ్
46. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనా దేశాల మంత్రుల స్థాయీ సమావేశం 2014 ఆగస్టు 7,8 తేదీల్లో ఎక్కడ జరిగింది? - న్యూఢిల్లీ
47. ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జర్మనీ క్రీడాకారుడు ఎవరు? - మిరోస్లావ్ క్లోజ్
48. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా 2014 ఆగస్టు 21న పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ శాస్త్రవేత్తకు(భారత్)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది? - ఎం.ఎస్ స్వామినాథన్
49. ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన 6,125 మీటర్ల స్టాక్ కంగ్రిని అధిరోహించిన హైదరాబాద్ బాలిక(12 ఏళ్లు)ఎవరు? - జాహ్నవి
50. ఆఫ్ఘనిస్థాన్‌లో 95 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? - 2014 ఆగస్టు 19
51. పార్లమెంటరీ ఒబిసి సంక్షేమ కమిటి చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించింది ఎవరు? - బండారు దత్తాత్రేయ
52. సేవలపై పన్నును సిఫార్సు చేసిన కమిటి ఏది? - రాజా చెల్లయ్య
53. 13వ ఆర్థిక సంఘ సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో ఎంత శాతాన్ని గరిష్ఠంగా రాషా్ట్రలకు బదిలీ చేయాలి? - 39.5 శాతం
54. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నెలసరి ఆదాయ ఖాతా, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వంటి డిపాజిట్ స్కీమ్‌లపై పొదుపు పరిమితిని పెంచాలని సిఫార్సు చేసిన కమిటి ఏది? - గుప్తా కమిటి
55. దేశంలో మొదటి కాంగ్రేసేతర ప్రధానమంత్రి ఎవరు? - మొరార్జీ దేశాయ్
56. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? - స్విట్జర్లాండ్‌లోని జెనీవా
57. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు ఏర్పడింది? - 1948 ఏప్రిల్ 7
58. ప్రస్తుత ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ ఏ దేశానికి చెందినవారు? - చైనా
59. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ ఎవరు? - రాజ్‌కుమారి అమృత్‌కౌర్
60. ఇటీవల ఏ వైరస్ వ్యాప్తి కారణంగా పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు? - ఎబోలా
61. భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? - 2005 అక్టోబరు 12
62. చెర్నోబిల్ అణు కర్మాగార ప్రమాదం ఎక్కడ సంభవించింది? - రష్యా
63. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని రద్దు పరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది? - జస్టిస్ బిపి. జీవన్‌రెడ్డి