Tuesday, February 7, 2023

2023 - 24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన పథకాలు

 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  2023-24కు సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం పరిస్థితుల నడుమ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను అమృతకాల బడ్జెట్‌గా మంత్రి పేర్కొన్నారు. ఇందులో విద్య, యువ నైపుణ్యాలు వంటి కొన్ని అంశాలకు పెద్దపీట వేయగా, వ్యవసాయం వంటివాటిని ఎప్పటిలాగే కొనసాగించారు. ఈ ఏడాది కొన్ని కొత్త పథకాలను మంత్రి ప్రవేశపెట్టారు.

 iGOT కర్మయోగి (iGOT Karmayogi):

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న లక్షలాది మంది తమలోని నైపుణ్యాలు పెంచుకోడానికి ప్రవేశపెట్టిందే ఈ పథకం. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఆన్‌లైన్‌ లెర్నింగ్ విధానంలో ఉద్యోగులు స్కిల్స్‌ నేర్చుకోవచ్చు.

 ఎంఎస్ఎంఈ (MSME):

చిన్న, మధ్య తరహ సంస్థలకు రుణాలు మంజూరు చేసే ఈ పథకానికి రూ.9,000 కోట్లు కేటాయించింది. రూ.రెండు లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఇది ఉపయోగపడుతుంది. రుణ వ్యయం ఒక శాతం మేర తగ్గుతుంది.

 మహిళా సమ్మాన్ బచత్ పాత్రా (Mahila Samman Bachat Patra):

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రూపొందించిన పథకం. ఇందులో మహిళ లేదా బాలిక పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి. రెండు సంవత్సరాల తర్వాత అంటే 2025 మార్చి తర్వాత తీసుకోవచ్చు. దీనికి 7.5 వడ్డీ ఇస్తారు. మధ్యలో అవసరాన్ని బట్టి నగదు తీసుకునే అవకాశం కూడా ఉంది.

 పీఎం ప్రణామ్ (PM PRANAM):

వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేలను కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిందే ఇది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడేలా ప్రోత్సహించడం. రైతులకు అవగాహన కల్పించడం.

అమృత్ దరోహర్ పథకం (Amrit Dharohar Scheme):

చిత్తడి నేలల వినియోగం పెంచేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు, భూమిలో కార్బన్ నిల్వలు పెంచుకోవడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం దీని లక్ష్యాలు. రాబోయే మూడేళ్లు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

 పీఎం మత్స్య సంపద యోజన:

మత్స్యకారులు, చేపల విక్రేతలు వంటి చిరు రంగాల వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, వారి వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనికి గాను రూ.6,000 కోట్లు కేటాయించారు. వీటికి సంబంధించిన కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు.

గోబర్దన్ పథకం (GOBARdhan):

అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్) రూ.పదివేల కోట్ల పెట్టుబడితో 500 ప్లాంట్లు స్థాపిస్తారు. ఇందులో జీవ వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ తయారుచేస్తారు.

 గ్రీన్ క్రెడిట్ ప్రొగ్రాం (Green Credit Programme):

పర్యావరణ రక్షణ కోసం, కాలుష్య కారకాలను తగ్గించి పర్యావరణ సమతుల్యత పాటించేలా ప్రణాళిక అమలు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. వనరులు పెంచేలా ప్రోత్సహించడం, ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం.నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీం: యువతల్లో నైపుణ్యాలు ప్రోత్సహించడానికి ఈ స్కీం ఉపయోగపడుతుంది. మూడు సంవత్సరాలలో 47 లక్షల మందికి స్టైఫండ్ ఇస్తారు.

 ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (Lab Grown Diamonds):

స్వదేశీ విజ్ఞానాన్ని ప్రోత్సహించి, దిగుమతులు తగ్గించుకునేందుకు LGD స్కీం ఉపయోగపడుతుంది. స్వదేశీ విత్తనాలు, యంత్రాలు రూపొందించేలా చూడటం, వీటికి సంబంధించిన పరిశోధనలపై ఆర్థిక సహకారం అందించడం.

No comments:

Post a Comment