Thursday, March 16, 2017

Wednesday, March 15, 2017

ANDHRA PRADESH BUDGET SPEACH 2017-18


Andhra Pradesh Budget in Brief 2017-18


నాలుగు దశాబ్దాల్లో 3% తగ్గిన హిందువుల జనాభా

నాలుగు దశాబ్దాల కాలంలో దేశంలో హిందువుల సంఖ్య పెరిగినా శాతం ప్రకారం చూస్తే దాదాపు మూడు శాతం తగ్గుదల ఉంది.  లోక్‌సభలో సభ్యుడు రాకేష్‌ సింగ్‌ అడిగిన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ జి.ఆహిర్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. 1971లో 82.7 శాతంగా ఉన్న హిందువుల జనాభా 2011 నాటికి 79.8 శాతానికి తగ్గిందని చెప్పారు. ‘‘1971 జనాభా లెక్కల ప్రకారం 45.33 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2011 నాటికి 96.62 కోట్లకు చేరింది. 1971 గణాంకాల్లో సిక్కిం జనాభాను మినహాయించారు. 1981లో అసోం, 1991లో జమ్మూకశ్మీర్‌, 2001లో మణిపూర్‌లోని సేనాపతి జిల్లా మావో మారం, పావో మట, పురుల్‌ సబ్‌డివిజన్లలోని జనాభాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆయా సంవత్సరాల్లో ఆ రాష్ట్రాలు, ప్రాంతాల్లో జనాభా లెక్కలు సేకరించలేదు’’ అని వివరించారు.

Sunday, March 12, 2017

ANDHRA PRADESH

Geographical view

Area: 160,205 km²

Land Structure: It contains plain (Andhra plains), Plateau (Rayalsima plateau, khammamplatue), Mountains (Eastern Ghats Vijayawada hills)

Important river: Krishna, Penneru, Godavari,

Main Crops: Rice, jowar, bajra, wheat, maize etc...  

Climate: tropical climate 

Main minerals: due to the variety of rocksand minerals it is called as ratnaGarbha.
First in iron ore production, magnese ore etc it is top producer of minerals in india.
Largest mica producer

Industries: AP ranks 4th at National level in IT performance.

River and dams

Sl.No.
River
Dam
Nearest City
Remark
1.
Krishna
a)Srisailam
b)Nagarjuna Sagar
c)Parkasam Barrage
Kurnool
Guntur
Guntur

Gravity & Earth-fill


2.
Godavari
Dowleswaram Barrage
Polavaram Project
Rajamundry
For irrigation


3.
Machkund River/ Sileru
Lower Sileru hydro
Visakhapatnam
Khammam

4.
Penneru

Nellore,
Cuddapah

5.
Nagavati

Srikulam

National Parks

Name of National Park
Special Species (if any important)
Important Remarks
Sri Venkateshwara National Park 
have many waterfalls
---
Gundla brahmeswaram park       

is Located between Kurnool and Prakasam districts over the Nallamallai mountain range
Coringa National Park  
more than 120 birds species are found
situated near Kakinada port
The Alisagar Deer park
---
 It is decorated with hillocks and flower gardens that increase the beauty of park


Reserved parks

Reserve Parks
Special Species (if any important)
Important Remarks
Nagarjunsagar-Srisailam 
tiger reserve    
spread over five districts (Nalgonda, Mahbubnagar, Kurnool, Prakasam&Guntoor)
Rollapadu WLS 
Only habitat for the endangered Great Indian Bustard
located in the Kurnool district
Pulicat Lake WLS

located in Nellore, Chittoor districts

Famous temple

Sl.No.
Monument/Temple/Sites
Located in
Remarks
1
Venkateswara Temple Tirumala(Tirupati Balaji)
in Chittoor District

2
Srisailam
Kurnool District
The sanctum sanctorium is covered with gold
3
Vinayaka Temple Kanipakam
Chittoor District on the banks of river Bahuda
temple of Lord SwayambuVinayaka
4
Sri Veereswara Swamy Temple
Muramalla
This holy shrine is the abode of Lord Sri Veereswaraswamy
5
Amaravati
Guntur District
 known as Dhanyakataka/Dharanikota   great Buddhist site Stupa built in pre-Mauryan times

6
Lakshmi Narasimha Temple
It is situated at the foot of the Auspicious Hill in Mangalagiri of Guntur district
one of the eight sacred places of Lord Vishnu in India.


Major Airports

1. Visakhapatnam Airport: Visakhapatnam 
2. Vijayawada Airport: Vijayawada
3. Cuddapah Airport: Cuddapah

Ports

AP is the secound maritime state (after Gujrat) in terms of cargo handled. 
1. Visakhapatnam Port: Visakhapatnam District (It is the fifth busiest port in India in terms of Cargo handled)
2. Kakinada Port: East Godavari District

Thermal Power plants in Andhra pradesh

Name of Thermal Power Plant
Location
Important Remarks
RayalaseemaThrmal Power plant          
Cuddapah,  
1050 megawatt (MW)  coal plant
vemagiri Power plant                   
EAstGodawari
388 MW gas based
vijayawada thermal plant              
Krishna
coal-based power plants
Simhadri Super Thermal Power Plant      
Visakhapatnam  
coal-fired power plant
Sri Damodaram Sanjeevaiah Thermal Power Station 
Nellore
coal-based power plants

INDIA BUDGET 2017-18







Friday, March 10, 2017

Saturday, March 4, 2017

4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

రెండు తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పెరిగింది. కేంద్రం ఇటీవల విడుదల చేసిన 4వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఏపీలో ప్రతి వెయ్యిమందికీ 1,020 మహిళలుండగా తెలంగాణలో 1,007 మంది ఉన్నారు. కానీ గత అయిదేళ్లకాలం సగటు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ప్రకారం ప్రతి 1000 మంది మగ శిశువులకు 874 మంది ఆడ శిశువులు మాత్రమే ఉన్నారు. ఏపీలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 914 మంది ఆడ శిశువులుండటం ఆందోళనకర పరిణామం. ఈసర్వేను తెలంగాణ రాష్ట్రంలో 2015 ఫిబ్రవరి 23 నుంచి మే 9 మధ్యకాలంలో నిర్వహించారు. ఇందులో భాగంగా 786 కుటుంబాలు, 7565 మంది మహిళలు, 1050 మంది పురుషుల నుంచి సమాచారం సేకరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో 10265 కుటుంబాలు, 10428 మంది మహిళలు, 1398 మంది పురుషుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 మే 6 నుంచి ఆగస్టు 4 మధ్యకాలంలో సర్వే చేశారు. పరిమితమైన నమూనాలతోనే నిర్వహించినందున గత కుటుంబ సర్వేలతో దీన్ని పోల్చి చూడలేమని పేర్కొంది.
ఇంకెన్నో ప్రత్యేకతలు... ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులయ్యే వారికి సగటున జాతీయ స్థాయిలో రూ.3,198 ఖర్చవుతుంటే, ఇది ఏపీలో రూ.2,145, తెలంగాణలో రూ.4,079గా ఉంది. దేశీయంగా సగటున 38.7% కాన్పులు ఆసుపత్రుల్లో జరుగుతుంటే ఏపీలో సగటున 91%, తెలంగాణలో 91.5% అవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సిజేరియన్‌ కాన్పులు దశాబ్దకాలంలో రెట్టింపయ్యాయి. 2005-06 నాటి సర్వే ప్రకారం ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్‌ కాన్పులశాతం 15.2%, ప్రైవేటు ఆసుపత్రుల్లో 27.7% ఉండగా తాజా ఈసంఖ్య 11.9, 40.9%కి చేరింది. తెలుగురాష్ట్రాల్లో ఈసంఖ్య జాతీయ సగటు కంటే అధికం. ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 57% కాన్పులు సిజేరియన్‌ ద్వారా అవుతుండగా తెలంగాణలో ఇది 74.9%మేర ఉంది.
శిశుమరణాలు గత పదేళ్లలో తగ్గాయి. ప్రతి వెయ్యి మందికి ఏడాదిలో గతంలో 57మంది చనిపోతుండగా 41కి తగ్గింది. ఈసంఖ్య కేరళలో 6గా ఉంది. ఏపీలో 40, తెలంగాణలో 35మేర శిశుమరణాలు ఉన్నాయి.
అక్షరాస్యత, బాల్యవివాహాల విషయంలో కేరళ మిగతా రాష్ట్రాలకంటే మిన్నగా ఉంది. అక్కడ 99.9% కాన్పులు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి. సిజేరియన్‌ కాన్పులసంఖ్య జాతీయసగటుకంటే తక్కువే. కేరళలో లింగనిష్పత్తి తగ్గుతోంది. 2005-06లో ప్రతి వెయ్యిమంది పురుషులకు అక్కడ 1,124 మంది మహిళలుండగా తాజా సర్వేలో ఆ సంఖ్య 1,049కి తగ్గిపోయింది.
జాతీయ స్థాయిలో ఇలా.. 
గడిచిన దశాబ్దకాలంలో జాతీయస్థాయిలో కొన్నిరంగాల్లో మంచి పరిణామాలే సంభవించినట్లు సర్వేలో వెల్లడింది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు వెళ్లే ఆరేళ్లలోపు పిల్లలసంఖ్య పదిశాతానికిపైగా పెరిగింది. అయిదేళ్లలోపు పిల్లల నమోదుసంఖ్య 40% వృద్ధిచెందింది. 20% అధిక ఇళ్లకు విద్యుత్తు సౌకర్యం సమకూరింది. రక్షితనీరు అందుబాటు విషయంలో మార్పేమీ కనిపించలేదు. గృహ మరుగుదొడ్ల సౌకర్యం మాత్రం 20% వృద్ధి నమోదైంది. ఆరోగ్యబీమా పరిధిలోకి వచ్చిన వారిసంఖ్య 24% పెరిగింది. ఇదే సమయంలో బాల్యవివాహాలు బాలికల్లో 20%, బాలురలో 12% మేర తగ్గాయి. మహిళల్లో సగటు గర్భధారణ తగ్గిపోయింది. 2005-06లో దేశంలో సగటున ఒక్కోమహిళ 2.7మంది పిల్లలకు జన్మనివ్వగా ఇప్పుడు అది 2.2కి పడిపోయింది. సర్వే సమయంలో ఇదివరకు 15-19 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 16% మంది గర్భవతులుండగా, తాజా సర్వేలో 7.9%కి తగ్గింది. మహిళా కు.ని.ఆపరేషన్లు 1.3%మేర, మగవారిలో 0.7%మేర తగ్గాయి. సంస్థాగత కాన్పులు పెరిగాయి. మాతృ, శిశు ఆరోగ్యసంరక్షణలో సానుకూల సంకేతాలు కనిపించాయి.
స్థూలకాయులు పెరిగారు: గత పదేళ్లలో మహిళలు, పురుషుల్లో స్థూలకాయుల సంఖ్య 8% పెరిగింది. చక్కెరవ్యాధి సమస్య పురుషుల్లోనే ఎక్కువగా నమోదైంది. 15-49 ఏళ్ల మధ్యవయస్సుల్లోని మహిళల్లో 22.3% మహిళలు సెర్విక్‌, 9.8% మంది రొమ్ము, 12.4% మంది నోటిసంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

Thursday, March 2, 2017

Nandi Awards


Wednesday, March 1, 2017

Andhra Pradesh General Knowledge-History Districts Geography

History of Andhra Pradesh
Andhra Pradesh region was ruled by many great rulers of Satavahana Empire, Simuka, Satakarni, Ikshvakus, Pallavas, Vijayanagara Empire. The Nizam wanted Hyderabad state to be independent from India, but the people of the region opposed the decision. With the help of Operation Polo in 1948 the state of Hyderabad was forcibly joined to the Republic of India. Potti Sreeramulu fasted until death in 1952 for independent state based on linguistic differences and to protect the interests of the Telugu-speaking people. Andhra State was formed from Madras State on 1 October 1953, with Kurnool as its capital city. Andhra Pradesh was formed by merging Andhra State and Telugu-speaking areas of Hyderabad State, and Hyderabad was made the new capital city. After the formation of Telangana state from Andhra Pradesh, in 2nd June 2014, Hyderabad was made the common capital for 10 years.

Geography of Andhra Pradesh
Andhra Pradesh is located on the southern part of India. It shares its borders with Telangana, Karnataka, Tamil Nadu, Chhattisgarh, Odisha and Bay of Bengal. A small enclave of 30 sq kms of Yanam, a district of Puducherry, lies in the Godavari delta to the northeast of the state. With a coastline of 974 km, it has the second longest coastline in India. State is spread in 160205 sq kms, making it the eight largest state in the country.

Government and Administration of Andhra Pradesh
For administration purpose Bihar is divided into two divisions and 13 districts. The major political parties of the state are Telugu Desam Party and YSR Congress Party. Andhra Pradesh legislative assembly consists of 175 seats. Andhra Pradesh contributes 25 members to the Indian Assembly. 

Language and Culture of Andhra Pradesh
Andhra Pradesh is famous for doll making, which are made from mud, dry grass, wood and lightweight metal alloys. Andhra Pradesh has different classical dance forms like Kuchipudi, Veeranatyam, Andhra Natyam, Bhamakalapam and folk dances like Tappeta Gullu, Lambadi, Butta bommalu, Dhimsa, and Chindu. Harikathaa Kalakshepam also known as Harikatha is narration of a story, with various songs relating to the story is originated here. Pickles and chutneys are famous here, people here eat lot of spicy food. Telugu is widely spoken in the state followed by Urdu, Hindi, Banjara, English Tamil, Kannada, Marathi and Oriya.

Education Status in Andhra Pradesh
Andhra Pradesh has a literacy rate of almost 91% which is one of the highest compared to other states. Indian Institute of Management (IIM) at Visakhapatnam is sanctioned and it will be functioning from the academic year 2015-16. Andhra Pradesh also houses Indian Space Research Organization which is a satellite launching station. Important universities in the state are Andhra University, Dr. N.T.R. University of Health Sciences, Sri Venkateswara University. National Institute of Technology and Indian Institute of Technology are announced by announced by Government of India. 

Economy of Andhra Pradesh
The gross state domestic product (GSDP) of Andhra Pradesh was 2359.3 billion in 2012–13. Economy of Andhra Pradesh mainly depends on services followed by agriculture and industry. Rice is the major food crop and staple food of the state and also known as “Rice bowl of India”. Other than rice, jowar, bajra, wheat, maize, minor millet, coarse grains are the cash crops. Livestock and poultry is also another profitable business. Pharmacy, Automobile, Textiles are the important industrial sector in the state. 

Tourism in Andhra PradeshSince state has the second highest coastline in the country it has many beaches throughout the coast line. Borra Caves in the Ananthagiri Hills near Vishakhapatnam are famous for million-year-old stalactite and stalagmite formations. Belum Caves in Kurnool district are the second largest natural caves on the Indian subcontinent. They are many hills and valleys like Araku valley, Horsley Hills, Papi Hills, etc. Sri Venkateswara Temple in Tirumala, one of the richest temples in the world is housed in Andhra Pradesh. Apart from this they are many religious destinations like Simhachalam Temple, Srisailam temple, Kanaka Durga Temple etc. 

Festivals: Celebrated in Andhra Pradesh

Ugadi is known as Telugu New Year. On this day, 'Ugadi Pacchadi' preparation comprising of six tastes is made. The ingredients of this preparation, though of different tastes when mixed in definite proportions result in a delicious dish. The Rayalaseema food and dance Festival celebrated in the month of October to exhibit the art and cuisine of the region. Tirumala Brahmotsavam is a Hindu festival celebrated for nine days at Tirumala Venkateswara Temple at Tirupati. Apart from these all the major festivals of the country are celebrated in the state.
 

Monday, February 27, 2017

89వ ఆస్కార్‌ అవార్డులకు ఎంపికైనది వీరే


*ఉత్త‌మ చిత్రం: మూన్‌లైట్‌
ఉత్త‌మ న‌టి: ఎమ్మా స్టోన్‌(లా లా ల్యాండ్‌)
ఉత్త‌మ న‌టుడు: క‌సే ఎఫ్లెక్‌(మాంచెస్ట‌ర్ బై ద సీ)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: డేమియ‌న్ చాజెల్‌ (లా లా ల్యాండ్‌)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే:  మూన్‌లైట్ (బ్యారీ జెన్కిన్స్‌, ట‌రెల్ అల్విన్ మెక్‌క్ర‌నే)
ఉత్త‌మ స్క్రీన్‌ప్లే:  మాంచెస్ట‌ర్‌ బై ద సీ(కెన్న‌త్ లొనెర్గాన్‌)
ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్‌:  సిటీ ఆఫ్ స్టార్స్‌(లా లా ల్యాండ్‌)
ఉత్త‌మ‌ ఒరిజిన‌ల్ స్కోర్‌:  లా లా ల్యాండ్‌
*ఉత్త‌మ ఛాయాగ్ర‌హ‌ణం:  లాలా ల్యాండ్‌( లిన‌స్ శాన్‌గ్రెన్‌) 
ఉత్త‌మ లైవ్ యాక్ష‌న్ షార్ట్‌:  సింగ్(క్రిస్ట‌ఫ్ డీక్‌, అన్నా యుడ్వ‌ర్డీ) 
ఉత్త‌మ డాక్యుమెంట‌రీ ల‌ఘు చిత్రం: ద వైట్ హెల్మెట్స్‌(ఓర్లాండో వోన్ ఇన్సీడెల్‌, జోన్నా న‌ట‌సెగర‌) 
ఉత్త‌మ ఎడిటింగ్‌:  హాక్సా రిడ్జ్‌(జాన్ గిల్బ‌ర్ట్‌) 
ఉత్త‌మ‌ విజువ‌ల్ ఎఫెక్ట్‌: ద జంగిల్ బుక్‌ (రాబ‌ర్ట్ లిగాటో, ఆడ‌మ్ వాల్డెజ్‌, ఆండ్ర్యూ ఆర్‌. జాన్స్, డ్యాన్ లెమ‌న్‌) 
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  లాలా ల్యాండ్‌(డేవిడ్ వాస్కో, శాండీ రేనాల్డ్స్‌) 
యానిమేటెడ్ ల‌ఘు చిత్రం: పైప‌ర్‌(అలాన్ స‌రిల్ల‌రో, మార్క్ స‌న్డెల్‌మెర్‌) 
యానిమేటెడ్ ఫీచ‌ర్ చిత్రం:  జూటోపియా(బైరాన్ హోవ‌ర్డ్‌, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్స‌ర్‌)
ఉత్త‌మ విదేశీచిత్రం:  సేల్స్‌మ్యాన్‌(ఇరాన్‌) 
ఉత్త‌మ స‌హాయ‌న‌టి:  వ‌యోలా డేవిస్‌(ఫెన్సెస్‌) 
సౌండ్ మిక్సింగ్‌:  హాక్సా రిడ్జ్‌ 
సౌండ్ ఎడిటింగ్‌: అరైవ‌ల్‌(బెల్లీమార్‌) 
* ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: ఒ.జె. మేడ్‌ ఇన్‌ అమెరికా(ఎజ్రా ఎడిల్‌మ్యాన్‌, కరోలైన్‌ వాటర్లో) 
* ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టూ ఫైండ్‌ ధెమ్‌(కొలెన్‌ ఎట్‌ఉడ్‌) 
* ఉత్త‌మ అలంక‌ర‌ణ‌, కేశాలంకరణ: సుసైడ్‌ స్క్వాడ్‌ ( అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్జోయో గెగ్రేరియన్‌, క్రిస్టోఫర్‌ నీల్స‌న్‌‌) 
* ఉత్తమ సహాయనటుడు: మహేర్షల అలీ(మూన్‌లైట్‌)

Sunday, January 29, 2017

దేశంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం

రైతన్నల ఆత్మహత్యలు గత మూడు దశాబ్దాలుగా దేశంలో ఆందోళనకర స్థాయిలో కొనసాగుతున్నాయి. వ్యవసాయ సంక్షోభాన్ని అంతకుముందు పెద్దగా పట్టించుకోకపోయినా.. పుష్కర కాలంగా దీనిపై పలు కమిషన్లు ఏర్పాటయ్యాయి. అధ్యయనాలు, సిఫారసులు వచ్చాయి. కేంద్రం 2004లో స్వామినాథన్‌ కమిషన్‌ను, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయతీ ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లు ఎంతో శ్రమించి అనేక కీలక సిఫారసులతో నివేదికలు అందించాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ సర్కారు రైతులను ఆదుకునేందుకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, జలయజ్ఞం తదితర చర్యలను చేపట్టారు. వైఎస్‌ చొరవతో కేంద్రంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2008–09 బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి  పలు చర్యలూ చేపట్టింది. కానీ.. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు చాలా వరకు అమలుకు నోచుకోలేదు. 2007లో జాతీయ రైతు విధానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినా అమలులో మాత్రం శ్రద్ధ చూపలేదు. మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు సమస్యలు విస్మరణకు గురయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీరుతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో రైతాంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుపోతోంది. దిగుబడులు పడిపోతున్నాయి.

చేతికందిన పంటలకు గిట్టుబాట ధర లేదు. పోనీ ధర కోసం నిల్వ చేసుకుందామన్నా తగినన్ని సదుపాయాలు లేవు. బ్యాంకుల నుంచి రుణాలు తగ్గిపోయాయి. దీంతో రైతులు ప్రయివేటు రుణాలను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మళ్లీ పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. సాగు సంక్షోభంలో చిక్కుకుని దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతోంటే.. ప్రభుత్వాలు మాత్రం చనిపోతున్న వారందరూ రైతులు కాదంటూ సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నాయి. జాతీయ రైతు విధానం–2007ను తాము ఇప్పటికే అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. కానీ అది ప్రకటనలకే పరిమితమైంది. ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని సమీక్షించడానికి ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు కేంద్రం గత ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు ఒక కేసు సందర్భంగా నివేదించింది.

స్వామినాథన్‌ సిఫారసులివీ...
2004 ఫిబ్రవరిలో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం జాతీయ రైతు కమిషన్‌(ఎన్‌సీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది. ఆ ఏడాది ఎన్నికల్లో ప్రభుత్వం మారి అధికారంలోకి వచ్చిన మన్మోహన్‌సింగ్‌ సర్కారు.. ఈ కమిషన్‌కు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిషన్‌ 2006 అక్టోబర్‌ 4న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులోని సిఫారసుల ఆధారంగా రైతులపై ముసాయిదా జాతీయ విధానాన్ని కూడా రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది. రైతాంగ సంక్షోభానికి.. భూసంస్కరణల అమలులో పూర్తి కాని అజెండా, నీటి పరిమాణం, నాణ్యత లోపాలు, సాంకేతికత నీరసించడం, సంస్థాగత రుణాల లభ్యత, సరిపోకపోవడం, వాటి సమయానుకూలత, భరోసాతో కూడిన, లాభదాయకమైన మార్కెటింగ్‌అవకాశాలు లోపిండం వంటివి ప్రధాన కారణాలైతే ప్రతికూల వాతావరణ అంశాలు కూడా ఈ సమస్యలకు తోడయ్యాయని పేర్కొంది. భూసంస్కరణలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. వ్యవసాయాన్ని రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో చేర్చాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్‌సమర్పించిన ముసాయిదా విధానం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి 2007 అక్టోబర్‌లో తుది విధానాన్ని పార్లమెంటుకు సమర్పించింది. దాదాపు పదేళ్లు కావొస్తున్నా.. ఈ జాతీయ రైతు విధానం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు.

భూసంస్కరణలపై కమిషన్‌ ఏం చెప్పిందంటే..

► సీలింగ్, మిగులు, బంజరు భూములు పంపిణీ చేయాలి
► నాణ్యమైన వ్యవసాయ భూమిని, అడవులను వ్యవసాయేతర అవసరాల కోసం కార్పొరేట్‌ రంగానికి మళ్లించడాన్ని నిరోధించాలి
► గిరిజనులు, పశువుల పెంపకందార్లకు అడవుల్లో పశువుల మేత హక్కులు, సీజనల్‌ ప్రవేశం, ఉమ్మడి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి
► భూ వినియోగ నిర్ణయాలను ఆయా ప్రాంతాలు, కాలాలను బట్టి పర్యావరణ, వాతావరణ, మార్కెటింగ్‌ అంశాలకు అనుసంధానం చేసే సామర్థ్యంతో జాతీయ భూమి వినియోగ సలహా సేవ సంస్థను నెలకొల్పాలి.

సాగునీటిని సంస్కరించాలి
► వ్యవసాయ భూముల విక్రయాన్ని భూమి విస్తీర్ణం, ప్రతిపాదిత వినియోగ స్వభావం, కొనుగోలుదారు తరగతి ఆధారంగా నియంత్రించేందుకు ఒక వ్యవస్థను నెలకొల్పాలి
► రైతులకు సాగునీరు నిరంతరంగా, నిష్పక్షపాతంగా అందేలా చూడటానికి సమగ్రమైన సంస్కరణలు అమలు చేయాలి
► వర్షపు నీటిని నేలలో ఇంకేలా చేయడం ద్వారా నీటి సరఫరా పెంపొందించడం, నీటి వనరులను రీచార్జ్‌ చేయాలి. ప్రయివేటు బావులు లక్ష్యంగా ‘పది లక్షల బావుల రీచార్జ్‌’ కార్యక్రమం ప్రారంభించాలి
► 11వ పంచవర్ష ప్రణాళిక కింద సాగునీటి రంగంలో పెట్టుబడులను గణనీయంగా పెంచాలి.

ఉత్పాదకతపై
► వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా పెంచాలి
► పంట భూమిలో సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించేందుకు ఆధునిక భూసార పరీక్ష లాబొరేటరీల జాతీయ వ్యవస్థను నెలకొల్పాలి
► భూసార ఆరోగ్యం, నీటి నాణ్యత, పరిమాణం, పర్యావరణ భిన్నత్వాన్ని పరిరక్షించే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి


రుణాలు, బీమా విస్తరించాలి
► సంప్రదాయ రుణ వ్యవస్థను.. నిజంగా పేదలు, అవసరమైన వారికి చేరేలా విస్తరించాలి
► పంట రుణాలపై సాధారణ వడ్డీ రేటును ప్రభుత్వ మద్దతుతో 4 శాతానికి తగ్గించాలి
► రుణ చెల్లింపు సామర్థ్యం పునరుద్ధరణ జరిగేవరకూ ప్రయివేటు అప్పులతో సహా అన్ని రుణాల వసూళ్లపై మారటోరియం విధించాలి. కరవు, విపత్తుల సమయంలో రుణాలపై వడ్డీని రద్దు చేయాలి
► వరుస ప్రకృతి విపత్తుల తర్వాత రైతులకు సహాయం అందించేందుకు వ్యవసాయ విపత్తు నిధిని నెలకొల్పాలి
► మహిళా రైతులకు జాయింట్‌ పట్టాలు హామీగా తీసుకుని కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు జారీ చేయాలి
► ఒక సమీకృత రుణపంట పశుసంపద మానవ ఆరోగ్య బీమా ప్యాకేజీని అభివృద్ధి చేయాలి
► పంట బీమా కవరేజీని దేశ వ్యాప్తంగా, అన్ని పంటలకూ వర్తించేలా విస్తరించాలి. ప్రీమియంలను తగ్గించాలి. గ్రామీణ బీమాను విస్తరించేందుకు గ్రామీణ బీమా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలి
► రైతు సంఘాలు, స్వయం సేవా సంఘాలు, జల సంఘాల సంస్థాగత అభివృద్ధి సేవలను మెరుగుపరచడం ద్వారా పేదల జీవనోపాధులను పెంపొందించాలి
► జాతీయ ఆహార హక్కు చట్టాన్ని చేయడంతో పాటు సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయడం తదితర చర్యలు చేపట్టాలి.


ఆత్మహత్యల నివారణకు..
► అందుబాటు ధరలో ఆరోగ్య బీమాను అందించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుత్తేజితం చేయాలి. ఆత్మహత్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతా ప్రాతిపదికన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను విస్తరించాలి
► రైతుల సమస్యలపై ప్రభుత్వం క్రియాశీలకంగా స్పందించేలా చూడటానికి రైతుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర స్థాయి రైతుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలి
► సూక్ష్మరుణ విధానాలను జీవనోపాధి ఫైనాన్స్‌ లాగా సేవలందించడానికి.. అంటే సాంకేతికత, నిర్వహణ, మార్కెట్ల వంటి రంగాల్లో మద్దతు సేవలతో కూడిన రుణాలను అందించడం పునర్నిర్మించాలి
► మండలం యూనిట్‌గా కాకుండా.. గ్రామం యూనిట్‌గా అన్ని పంటలకూ పంట బీమా వర్తింపచేయాలి.
► వృద్ధాప్య మద్దతు, ఆరోగ్య బీమాతో కూడిన సామాజిక భద్రతా పరిధిని అందించాలి.
► నాణ్యమైన విత్తనాలు తదితర ఇన్‌పుట్‌ సాధనాలు అందుబాటు ధరల్లో సరైన సమయంలో సరైన ప్రదేశంలో లభ్యమయ్యేలా చూడాలి.
► రైతులకు గరిష్ట ఆదాయాలు అందించే.. తక్కువ ప్రమాదం గల, తక్కువ ధర గల సాంకేతికతలను సిఫారసు చేయాలి.
► మెట్ట ప్రాంతాల్లో జీలకర్ర వంటి జీవనాధార పంటల విషయంలో మార్కెట్‌లో జోక్యం చేసుకునే పథకాలపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముంది. ధరల అనిశ్చితి నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి.
► అంతర్జాతీయ ధరల నుంచి రైతులకు రక్షణ కల్పించడానికి దిగుమతి సుంకాలపై వేగంగా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
► రైతుల సంక్షోభం అధికంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామ విజ్ఞాన కేంద్రాలు (కేవీసీలు) ఏర్పాటు చేయాలి. ఇవి.. వ్యవసాయం, అనుబంధ జీవనోపాధులకు సంబంధించిన అన్ని కోణాల్లోనూ క్రియాశీలమైన, డిమాండ్‌తో కూడిన సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తూ మార్గదర్శక కేంద్రాలుగా పనిచేయాలి.
► ఆత్మహత్య ప్రవర్తన సంకేతాలను ముందుగా గుర్తించే విధంగా ప్రజలకు బహిరంగ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి.


ఖర్చుపై 50 శాతం ఎంఎస్‌పీ..
► వ్యవస్థీకృత మద్దతును ఉపయోగించుకోవడానికి, రైతు  వినియోగదారులను నేరుగా అనుసంధానించడానికి, వికేంద్రీకృత ఉత్పత్తిని కోత అనంతర నిర్వహణ, విలువ చేర్పు, మార్కెటింగ్‌వంటి కేంద్రీకృత సేవలతో కలపడానికి, చిన్న పత్తి రైతుల సంఘాల వంటి వస్తువు ప్రాతిపదికగా రైతుల సంఘాలను ప్రోత్సహించాలి.
► కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలును మెరుగుపరచాలి. వరి, గోధుమలే కాకుండా ఇతర పంటలకూ ఎంఎస్‌పీని అమలు చేయాల్సిన అవసరముంది. జొన్నలు వంటి చిరుధాన్యాలను కూడా ప్రజా పంపిణీలో శాశ్వతంగా చేర్చాలి.
► కనీస మద్దతు ధర అనేది సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 50 శాతం అదనంగా ఉండాలి.
► మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌(ఎంసీడీ), ఎన్‌సీడీఈఎక్స్, ఏపీఎంసీ ఎలక్ట్రిక్‌నెట్‌వర్కుల ద్వారా.. 93 వస్తువులనూ చేర్చుతూ.. 6000 టెర్మినళ్లు, 430 పట్టణాలు, నగరాలలో అప్పటి మరియు భవిష్యత్తు ధరల సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.
► ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును వేగవంతం చేయడం, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి చర్యలు చేపట్టాలి.

Thursday, January 26, 2017

APPSC CORRIGENDUM